Udaya Bhanu: యాంకరింగ్ విషయంలో ఉదయభాను సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యాంకర్ అనగానే గుర్తొచ్చే పేరు సుమ(Suma). ఎవరైనా స్టార్ హీరోను ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏదైనా పెద్ద సినిమాకు చెందిన ఈవెంట్ చేయాలన్నా వెంటనే సుమ కాల్షీట్స్ ను లాక్ చేసుకుంటూ ఉంటారు నిర్మాతలు. సుమ తర్వాత అనసూయ(Anasuya), రష్మి(Rashmi), శ్రీముఖి(Sree Mukhi) కూడా ఈ రేసులో కొనసాగిన వాళ్లే. కానీ ఒకప్పుడు ఉదయ భాను కూడా ఈ లిస్ట్ లో ఉండేవారు.
హృదయాంజలి కార్యక్రమంతో ప్రేక్షకులకు పరిచయమైన ఉదయ భాను(Udaya Bhanu) తన మాటలతో, అందంతో, చలాకీదనంతో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన ఉదయ భానుకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత రీసెంట్ గా ఓ భామ అయ్యో రామ(Oh Bhama Ayyo Rama) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా కనిపించారు ఉదయభాను.
ఆమెను చూసి డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారనగా, దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదొక్క ఈవెంటే చేశానని, మళ్లీ చేస్తానో లేదో కూడా తెలీదని, రేపు ఈవెంట్ అనుకుని అంతా ఫిక్సయ్యాక సరిగ్గా సమయానికి ఈవెంట్ మనకు ఉండదని, ఇండస్ట్రీలో అంత పెద్ద సిండికేట్ ఎదిగిందని, సుహాస్(suhas) బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేయగలిగానని అన్నారు. ఆ తర్వాత మచ్చ రవి(macha ravi) ఉదయభాను మైక్ పట్టుకుంటే ఓ నారి వంద తుపాకుల టైప్ అనగా, నాక్కూడా చాలా బుల్లెట్లు తగిలాయి కానీ అదెవరికీ తెలియదని ఆమె నవ్వుతూనే కౌంటరిచ్చారు. కాగా యాంకరింగ్ విషయంలో ఉదయ భాను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.