శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్స్ బ్రాండ్ అంబాసీడర్ గా సినీ నటుడు సత్యదేవ్

శ్రీ చక్రా మిల్క్ కోత్త లోగోను అవిష్కరించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గోట్టి పాటి రవికూమార్
శ్రీ చక్రా బ్రౌచర్ ని ఆవిష్కరించి గడ్డం ప్రసాద్
శ్రీ చెక్రా మిల్క్ కమర్షియల్ యాడ్ ని లాంచ్ చేసిన సినీ నటుడు విజయ దేవర కోండ
శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ LLP తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్ లో వార్షికోత్సవ వేడుకలు నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొత్త లోగోను ఆవిష్కరించారు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ ఇంధన శాఖ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానిత అతిథి పోస్టర్ ఆవిష్కరణ శ్రీ టి డి జనార్ధన్ పొలిటికల్ సెక్రటరీ & పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు ఫ్లైయర్‌ని ఆవిష్కరించారు శ్రీ మూరకొండ జగన్మోహన్ రావు MD, విజేత సూపర్ మార్కెట్స్, తెలంగాణ యాడ్ ఫిల్మ్ లాంచ్ శ్రీ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ దేవర కోండ, సత్యదేవ్ భారతీయ చలనచిత్ర నటుడు (శ్రీచక్ర బ్రాండ్ అంబాసిడర్) శ్రీ చక్ర మిల్క్ ఎండి శ్రీ రామంజనేయులు పలువురు శ్రీ చక్ర ప్రతినిధులు పాల్గోన్నారు.
శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్ LLP తొలిసారిగా 2014లో పశ్చిమగోదావారి జిల్లా,నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో మొదలై పాడి రైతుల సహకారం అలాగే వినియోగదారుల ప్రోద్బలంతో తర్వాతి కాలంలో రాయలసీమ, అనంతపురం జిల్లాలోని గజరాంపల్లి గ్రామంలో అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని అంతారంగ్రామంలో అతిపెద్ద ఫ్యాక్టరీలతో వినియోగదారులు, పాడి రైతులకు మరింత దగ్గరగా వ్యాపారాన్ని విస్తరించారు.
నాణ్యతే లక్ష్యంగా ఖచ్చితమైన భద్రతాప్రమాణాలే ధ్యేయంగా ఆధునిక పరికరాలతో 18 పాల శీతలీకరణకేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల టెట్రాప్యాక్కింగ్ మిషినరీతో నేడు తమ పాలు మరియు పాల ఉత్పత్తులతో 25 వేలకు పైగా కుటుంబాలకు, వెయ్యికి పైగా రెస్టారెంట్లకు,అనేక ప్రభుత్వ,ప్రేవేటు విద్యాసంస్థలకు రోజువారీ ఆహారంలో భాగమై వారి ఆనందానికి, ఆరోగ్యానికి కారణమై నిలిచింది.
పదేళ్ల ప్రస్థానంలో 200 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్, లక్షమందికి పైగా ఉపాధి, ఉద్యోగాలను కలిపించి వారి సహకారంతో శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ దినదినాభివృద్ధి చెంది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నాణ్యమైన పాలు మరియూ పాల ఉత్పత్తులతో తమదైన స్థానాన్ని సంపాదించారు.
కరోనా లాక్ డౌన్ ను సైతం సమర్ధవంతంగా ఎదురుకున్న శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ LLP అతి త్వరలో ఐదు కోట్ల పెట్టుబడితో ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ ఫెసిలిటీతో బట్టర్, ఆటోమేటిక్ పన్నీర్ ప్లాంట్, ఫ్లేవర్డ్ మిల్క్ లతో అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
" శ్రీచక్రా ఫ్రెష్" పేరుతో శ్రీచక్ర తెలంగాణ మరియూ ఆంధ్రప్రదేశ్లలో అన్ని ప్రాంతాలలో ఔట్లెట్స్ ప్రారంభించి తమ పరిశ్రమను మరింత బలోపేతం చేయనున్నారు.అలాగే "అరబ్" (యూఏఈ) మరియు దేశీయ మార్కెట్ లో కూడా సరికొత్త పేరుతో అడుగు పెట్టనున్నారు.