Sree Vishnu: వెంకీతో అలాంటి సినిమా చేస్తానంటున్న శ్రీవిష్ణు
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. అప్పట్లో ఎన్టీఆర్(NTR)- ఏఎన్నార్(ANR) కలిసి దేవుడు చేసిన మనుషులు(Devudu Chesina Manushulu) సినిమా చేస్తే ఆ తర్వాత కృష్ణ(Krishna)-శోభన్ బాబు(Sobhan Babu) కలిసి పలు సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత జెనరేషన్ లో వచ్చిన హీరోలు మాత్రం మల్టీస్టారర్లు చేయడం తగ్గించారు.
2013లో వెంకటేష్(Venkatesh) ఈ ట్రెండ్ ను మళ్లీ స్టార్ట్ చేసి పలువురితో సినిమాలు చేశారు. ఇప్పుడు వెంకీ, మరో టాలెంటెడ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. అతను మరెవరో కాదు శ్రీవిష్ణు(Sree Vishnu). రీసెంట్ గా సింగిల్(Single) ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఈ విషయాన్ని వెల్లడించాడు. వెంకీ(Venky)కి శ్రీవిష్ణు చాలా పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే.
సింగిల్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు, వెంకీతో తాను తప్పకుండా సినిమా చేస్తానని, ఆల్రెడీ రామ్ అబ్బరాజు(Ram Abbaraju) కథను రెడీ చేస్తున్నాడని, కథ పూర్తయ్యాక వెంకీ దగ్గరకు వెళ్తే ఆయన తప్పకుండా సినిమా చేస్తారనే నమ్మకం తనకుందని చెప్పిన శ్రీవిష్ణు, ఈ సినిమా కాకపోయినా మరో కథతో అయినా ఆయనతో కలిసి నటిస్తానని, తమ కలయికలో వచ్చే సినిమా అదిరిపోతుందని తెలిపాడు.






