Sree Vishnu: ఆ సినిమా తర్వాత బాలీవుడ్ ఆఫరొచ్చింది
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను మెప్పిస్తున్న శ్రీవిష్ణు(Sree Vishnu) తాజాగా సింగిల్(Single) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని, శ్రీవిష్ణు కెరీర్లో మరో మంచి హిట్ గా నిలిచింది.
సింగిల్ సక్సెస్ జోష్ లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్న శ్రీవిష్ణు పలు విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. రొటీన్ సినిమాలు చేయడం తనకు నచ్చదని చెప్తున్న శ్రీవిష్ణు, తాను ఏ సినిమా చేసినా ఆడియన్స్ కు నచ్చేలా ఉండాలనుకుంటానని, అందుకే ప్రతీ సినిమాకూ కొత్తదనం కోరుకుంటూ ఉంటానని, కథల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తానని చెప్పాడు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వెంకటేష్(Venkatesh), చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ హీరోలు ఫోన్ చేసి ప్రశంసించినప్పుడు తనకెంతో సంతోషమేసిందని, బ్రోచేవారెవరురా(Brochevarevarura) సినిమా చూసి ఇండస్ట్రీలోని ఎంతోమంది ఫోన్లు చేశారని, స్వాగ్(Swag) సినిమా తర్వాత తనకు కోలీవుడ్ నుంచి ఎన్నో ఫోన్లు రావడంతో పాటూ బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ కూడా వచ్చిందని శ్రీవిష్ణు వెల్లడించాడు.






