Samantha-Sree Vishnu: గోల్డెన్ ఛాన్స్ ను సరిగా వాడుకుంటారా?
మే నెల వచ్చేసింది. ఆల్రెడీ మే ను నేచురల్ స్టార్ నాని(Nani) ఎంతో గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. మే 1న రిలీజైన నాని హిట్3(Hit3) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఆల్రెడీ హిట్3 సెకండ్ వీక్ లోకి ఎంటరవగా ఈ వారం టాలీవుడ్ లో రెండు సినిమాలు రిలీజవుతున్నాయి. అవి శ్రీ విష్ణు(Sree Vishnu) సింగిల్(Single) మరియు సమంత(Samantha) శుభం(Subham).
ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. సింగిల్ సినిమాను శ్రీ విష్ణు సరికొత్తగా ప్రమోట్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంటే, సమంత నిర్మిస్తున్న మొదటి సినిమాగా శుభంకు కూడా మంచి హైప్ ఏర్పడింది. దానికి తోడు రెండు సినిమాల ట్రైలర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకూ ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది.
ఈ వారం సింగిల్, శుభం తప్ప మరే సినిమాలూ రిలీజవకపోవడం ఒక ప్లస్ అయితే నెక్ట్స్ వీక్ కూడా ఎలాంటి సినిమాలు రిలీజవడం లేదు. కాబట్టి ఈ రెండు సినిమాలూ మంచి టాక్ తెచ్చుకుని ఆడియన్స్ ను అలరించి, మంచి వర్డ్ ఆఫ్ మూత్ తో బయటికొస్తే త్వరగా బ్రేక్ ఈవెన్ అవడంతో పాటూ సమ్మర్ సీజన్ కాబట్టి లాభాల వర్షం కురిసే ఛాన్సుంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ను సమంత, శ్రీ విష్ణు ఎంతవరకు వాడుకుంటారో చూడాలి.






