Pawan Kalyan: పవన్ ఆ సినిమా చేసుంటేనా..
టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కూడా ఒకరు. ఆయనకు హీరోగా మాత్రమే కాకుండా పలు అంశాల్లో మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ లో డైరెక్షన్ కూడా ఒకటి. గతంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జానీ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. పవన్ డైరెక్షన్ లో వచ్చిన జానీ(Johny) సినిమా భారీ అంచనాలతో రిలీజైంది.
ఇప్పటికీ ఆ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. భారీ క్రేజ్ తో రిలీజైన జానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. అదే సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేస్తే మంచి వసూళ్లు దక్కే ఛాన్సుంది. అయితే జానీ తర్వాత పవన్(Pawan) దర్శకత్వంలో మరో సినిమా వచ్చింది లేదు. సర్దార్ గబ్బర్ సింగ్(Sardar Gabbar Singh) కు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు కానీ దర్శకత్వం మాత్రం పవన్ చేయలేదు.
ఇదిలా ఉంటే పవన్ జానీ దర్శకత్వం వహించినప్పుడే మరో సినిమాను కూడా చేద్దామనుకున్నారట. ఆ సినిమాను పూర్తిగా అడవి మృగాల నేపథ్యంలో తీయాలని పవన్ ప్లాన్ చేసుకుని, దాని కోసం పులి పిల్లలు, ఇతర జంతువులపై రీసెర్చ్ కూడా చేశారని అప్పట్లో రేణూ దేశాయ్(Renu Desai) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పవన్ తన ఆలోచల్ని అప్పట్లోనే సినిమాగా మలిచి ఉంటే ఆ సినిమా మంచి సినిమా అయి ఉండేదని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.






