Ram Charan: రంగస్థలాన్ని మించేలా పెద్ది
రామ్ చరణ్(Ram Charan)- బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddhi) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. ఉప్పెన తర్వాత ఎంతో టైమ్ తీసుకుని బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై మొదటి నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి.
దానికి తగ్గట్టే పెద్ది నుంచి వచ్చిన గ్లింప్స్ కు కూడా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దాంతో పాటూ పెద్ది సినిమా కథ గురించి సుకుమార్(sukumar), శివరాజ్ కుమార్(Sivaraj Kumar), ఏఆర్ రెహమాన్(AR Rahman) ఇప్పటికే ఎంతో గొప్పగా చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులకు కూడా పెద్దిపై భారీగా అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉంటే రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా లండన్ వెళ్లిన చరణ్ అక్కడి ఫ్యాన్స్ తో మాట్లాడుతూ పెద్ది గురించి మాట్లాడి అందరినీ ఖుషీ చేశాడు. పెద్ది షూటింగ్ ఆల్రెడీ 30% పూర్తైందని, ఈ సినిమా రంగస్థలాన్ని(Rangasthalam) మించి ఉంటుందని చెప్పి అక్కడి ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు. పెద్ది గురించి చరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






