Pranitha Subhash: ప్రైవేట్ పూల్ పక్కన స్విమ్‌సూట్‌లో ప్రణీత

బాపు బొమ్మగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది ప్రణీతా సుభాష్(Pranitha Subhash). పలు సినిమాల్లో అవకాశాలైతే అందుకుంది కానీ అమ్మడికి స్టార్‌డమ్ మాత్రం తీరని కలగానే మిగిలింది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీతా తాజాగా ఓ ఐలాండ్ లో దర్శనమిచ్చింది. వెనుక సముద్రం కనిపించేలా ఓ ప్రైవేట్ పూల్ అంచున నిలబడి ప్రణీతా స్విమ్ వేర్ లో ఇచ్చిన పోజులు నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. వైట్ కవరప్ చారల స్విమ్ వేర్, తలకు పెద్ద ఫ్లాపీ టోపీలో ప్రణీతా నవ్వుతూ మరింత అందంగా కనిపించగా, అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.