Niharika: చీరకట్టులో ఆకట్టుకుంటున్న మెగా డాటర్

మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక వారసురాలు నిహారిక(niharika). ఓ వైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ గా కెరీర్లో ముందుకెళ్తున్న నిహారిక ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా దసరా సందర్భంగా అమ్మడు కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో నిహారిక యాష్ కలర్ పట్టు చీర, పీచ్ కలర్ బ్లౌజ్ ధరించి దానికి తగ్గట్టే జడ వేసుకుని పూలు పెట్టుకుని, సింపుల్ జువెలరీతో అందరినీ ఆకట్టుకుంటుంది. నిహారిక షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.