Srinidhi Shetty: మొదటి సారి అలాంటి సినిమా చేస్తున్నా

మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ఆ తర్వాత 2018లో కెజిఎఫ్(KGF) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెజిఎఫ్, కెజిఎఫ్2(KGF2) సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను మెప్పించిన శ్రీనిధి ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వచ్చిన హిట్3 సినిమాలో కనిపించి మెప్పించింది.
ఇండస్ట్రీలో చాలా మందికి దక్కని ఛాన్స్ మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడం. అలాంటిది శ్రీనిధికి దక్కింది. ఇప్పటివరకు శ్రీనిధి చేసిన సినిమాలన్నీ వయొలెన్స్, బ్లడ్ తోనే కూడుకుని ఉండేవి. కానీ ఇప్పుడు మొదటి సారి శ్రీనిధి అలాంటివేమీ లేకుండా సినిమా చేస్తోంది. అదే తెలుసు కదా(telusu kadha). ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా రూపొందింది.
సిద్దు జొన్నలగడ్డ(siddhu jonnalagadda) హీరోగా రాశీఖన్నా(Raashi khanna), శ్రీనిధి శెట్టి(srinidhi shetty) హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు నీరజ కోన(neeraja kona) దర్శకత్వం వహించింది. సెప్టెంబర్ 17న తెలుసు కదా రిలీజ్ కానుండగా, ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీనిధి తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ స్టంట్ మాస్టర్, బ్లడ్ లేని సినిమా చేశానని పేర్కొంది. మరి ఈ సినిమా శ్రీనిధికి ఎలాంటి రిజల్ట్ ను మిగులుస్తుందో చూడాలి.