Nayanthara: చిరూ సినిమాకు రేటు తగ్గించిన నయన్
మలయాళ సినిమాలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నయనతార(Nayanthara) ఆ తర్వాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి క్రేజ్ తో పాటూ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయన్, లేడీ సూపర్ స్టార్ గా బాగా పాపులర్ అయింది. ఎంతో కాలంగా మంచి డిమాండ్ తో నయన్ టాప్ రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది.
అయితే ఉన్నట్టుండి నయనతార ఇప్పుడు చిరంజీవి కోసం తీసుకున్న డెసిషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో చిరంజీవి(chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నయన్(Nayan) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమా కోసం నయనతార రూ.18 కోట్లు తీసుకోనుందని వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా నయన్ ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించి రూ.6 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అయితే సడెన్ గా నయన్ పారితోషికాన్ని తగ్గించడం ఆమె మార్కెట్ ను దెబ్బతీస్తుందని కొందరంటుంటే అది కేవలం రీజనల్ మూవీ కావడం వల్లే నయన్ రేటు తగ్గించిందని, ఆమె ఖాతాలో పలు భారీ బడ్జెట్ సినిమాలున్నాయని, ఆ సినిమాలకు నయనతార భారీగా కోట్ చేస్తుందని అంటున్నారు.






