ఆ హీరోతో నటించాలనే నా కోరిక తీరింది…

తెలుగు హీరో వెంకటేశ్ సరసన నటించాలనే కోరిక చాలా సంవత్సరాల నుంచి ఉంది. అయితే నారప్ప సినిమాతో నా కోరిక తీరినట్లు ప్రియమణి తన అభిమానులతో చెప్పింది. పెళ్ళైన కొత్త లో చిత్రంతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో 10 సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళం కన్నడ భాషల్లో సూపర్ హిట్స్ అందుకున్న ప్రియమణి పెళ్ళి తర్వాత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. తర్వాత వెంకటేశ్‍తో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకుంది. ఆ సినిమాకి సంబంధించిన ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.