Mamitha Baiju: రేటు పెంచిన ప్రేమలు బ్యూటీ
ప్రేమలు(Premalu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు. మలయాళ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన మమిత కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువ సపోర్టింగ్ రోల్సే చేసింది. కానీ ప్రేమలు తర్వాత అమ్మడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సొంత భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమా అవకాశాలొస్తున్నాయి.
ప్రస్తుతం మమిత తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లో డ్యూడ్(Dude) అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో విజయ్(Vijay) హీరోగా తెరకెక్కుతున్న జన నాయగన్(Jana Nayagan) లో కూడా నటిస్తోంది. అయితే దీపమున్నప్పుడే చక్కబెట్టుకోవాలన్నట్టు మమిత కూడా క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలనే ఆలోచనతో అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే మమిత ఈ రెండు సినిమాలకూ రేటు పెంచినట్టు తెలుస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలు తీసుకునే మమిత, ఇప్పుడు డ్యూడ్ కోసం రూ.75 లక్షలు, జన నాయగన్ కోసం ఏకంగా రూ. 1 కోటి రూపాయలు తీసుకుంటుందని సమాచారం. ఈ రెండు సినిమాలూ హిట్ అయితే మమిత తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచడం ఖాయం.






