Malavika Mohanan: చీరలో మెరిసిపోతున్న మాళవిక
కేరళ భామ మాళవిక మోహనన్(Malavika Mohanan) ఇంకా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయకపోయినా అమ్మడు ఆల్రెడీ ఇక్కడ మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ వార్తల్లో ఉండే మాళవిక తన అందాలతో నెటిజన్లను మైమరపిస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు చీరలో మెరిసి మరోసారి అందరి చూపుని తనవైపుకు తిప్పుకుంది. బ్లాక్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన మాళవిక సింపుల్ గా ఉంటూనే ఎంతో అందంగా కనిపించింది. మాళవిక షేర్ చేసిన ఈ మిర్రర్ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.






