RC17: సుకుమార్ సినిమాలో ఐరెన్ లెగ్ హీరోయిన్

ప్రస్తుతం బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో పెద్ది(Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తూ బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan) ఆ సినిమా తర్వాత సుకుమార్(Sukumar) దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్(Charan), సుక్కు (sukku)కలయికలో వస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్టు పై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. చరణ్ కెరీర్ 17వ మూవీగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని సుకుమార్ అనుకుంటున్నారట. ఆమె మరెవరో కాదు. కృతి సనన్(Krithi Sanon). ఆల్రెడీ మేకర్స్ కృతిని సంప్రదించి, ఆమెతో స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
కాగా టాలీవుడ్ లో కృతి ఇప్పటికే మూడు సినిమాలు చేయగా, ఆ మూడు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఆర్సీ17(RC17) కోసం కృతి పేరు పరిశీలనలో ఉందని తెలిసిన ఫ్యాన్స్ అలాంటి ఐరెన్ లెగ్ హీరోయిన్ ను ఎందుకు తీసుకుంటున్నారని డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే, సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసి, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను చేయిస్తున్నట్టు తెలుస్తోంది.