Kamal Haasan:ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కమల్‌హాసన్
ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ (Kamal Haasan) కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi )ని కలవడం గౌరవంగా భావిస్తున్నా. తమిళనాడు (Tamil Nadu) ప్రజల ప్రతినిధిగా, కళాకారుడిగా ప్రధానికి కొన్ని అంశాలపై విజ్ఞప్తి చేశా. ప్రధానంగా కీళడి గురించి చర్చించా. తమిళ నాగరికత, తమిళ భాషను ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రధాని మద్దతు కోరా అని కమల్ హాసన్ తెలిపారు. మక్కల్ నీది మయ్యం ( ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ రాజ్యసభ (Rajya Sabha) ఎంపీగా జూలైలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.







