Kalyani Priyadarshan: ఏ కష్టమొచ్చినా అతనికే ముందు ఫోన్ చేస్తా

మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) అందరికీ సుపరిచితురాలే. హలో (Hello) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన కళ్యాణి ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. చిత్రలహరి(Chitralahari), రణరంగం(Ranarangam) లాంటి తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ కళ్యాణికి అనుకున్న స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. రీసెంట్ గా మలయాళ సినిమా లోకా(Lokah) తో మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది కళ్యాణి.
కెరీర్ స్టార్టింగ్ నుంచి సరదా క్యారెక్టర్లే చేసుకుంటూ వచ్చిన కళ్యాణి ఫస్ట్ టైమ్ లోక కోసం స్టంట్స్ కూడా చేసింది. అంతేకాదు, ఆ సినిమాలో సూపర్ ఉమెన్ పాత్రలో నటించి కేవలం మలయాళ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది కళ్యాణి. లోక సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కళ్యాణి రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
తన ప్రాపర్ కేరళ అయినప్పటికీ చెన్నైలోనే పుట్టి పెరిగానని, అమ్మానాన్న ఇండస్ట్రీ వాళ్లే కావడంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేదని, అలా 2017లో హలో సినిమాతో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని, కొత్త లోక కోసం ఆరు నెలల స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నానని చెప్పిన కళ్యాణి, ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, తనకే కష్టమొచ్చినా ముందు ఫోన్ అతనికే చేస్తానని కళ్యాని వెల్లడించింది.