కోమలిపైనే కాజల్ ఆశలు
కాజల్ కెరీర్ ఆప్ అండ్ డౌన్స్‌లో నడుస్తోంది. చేస్తున్న సినిమాలు వరుసగా దెబ్బతీస్తుంటే, తేజ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సీతకూ చుక్కెదురైంది. దీంతో తమిళం, తెలుగులోనూ కాజల్ మార్కెట్ రివర్స్ గేర్‌లో పడింది. దీంతో మరోసారి ఫొటోషూట్ అస్త్రాలనే కాజల్ నమ్ముకుంటోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో తమిళంలో చేయాల్సిన ఇండియన్ 2, కోమాలి చిత్రాలే ఉన్నాయి. ఇండియన్ -2 ఎప్పుడు మొదలవుతుందో, అసలు మొదలవుతుందో లేదో కూడా తెలీని పరిస్థితి. కమల్-శంకర్ భారీ ప్రాజెక్టుపై కథనాలే కూడా, వదంతులూ ఆగిపోయాయి. అదీ పరిస్థితి., దీంతో కోమాలి పైనే గంపెడు ఆశలు పెట్టుకుందట కాజల్ బ్యూటీ. ఇందులో జయం రవి సరసన ఆడిపాడింది కాజల్. అందపరంగానే కాదు, కథాపరంగానూ మంచి పాత్ర దొరికిందన్న సంతోషంలో ఉంది కాజల్. ఈ ప్రాజెక్టు తర్వాత కెరీర్ మళ్లీ ఉపందుకుంటుందన్న కొండంత ఆశతో ఉంది కాజల్ బ్యూటీ.






