Janhvi Kapoor: పెద్ది పైనే జాన్వీ ఆశలు
శ్రీదేవి(sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(janhvi kapoor) సినిమాలతోనే కాకుండా తన ఫ్యాషన్ ఎంపికలతో, గ్లామర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ కు కెరీర్ స్టార్టింగ్ లో చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా గ్లామర్ కారణంతో అమ్మడికి మంచి ఛాన్సులొచ్చాయి.
జాన్వీ ఇప్పటికే సుమారు పది సినిమాలు చేయగా, అందులో ఏ సినిమాలోనూ జాన్వీ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నది లేదు. ఇప్పటివరకు జాన్వీలోని యాక్టింగ్ టాలెంట్ ను అమ్మడు బయటపెట్టలేదు. ఎన్టీఆర్(NTR) తో చేసిన దేవర(devara) సినిమాలో కూడా జాన్వీ గ్లామర్ కే పరిమితమైంది తప్పించి అక్కడా యాక్టింగ్ కు స్కోప్ లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాన్వీ తన ఆశలన్నింటినీ పెద్దిపై పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, పెద్దిలో జాన్వీ కోసం బుచ్చిబాబు అదిరిపోయే క్యారెక్టర్ ను రాశాడని, జాన్వీ గత సినిమాల్లా కాకుండా ఈ మూవీలో తన పాత్ర కథను ముందుకు నడిపించేలా ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే జాన్వీ ఎంతో కాలంగా చూస్తున్న ఎదురుచూపులకు బ్రేక్ పడ్డట్టే అవుతుంది.







