Rana Daggubati: ఆ మూడు గంటల్నీ లైఫ్ లో మర్చిపోలేను
సినీ ఇండస్ట్రీలో ఉండే వారి జీవితాలెప్పుడూ వారు అనుకున్నట్టు ఉండవు. ఇండస్ట్రీలో ఉండటానికి వాళ్లెంతో కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు చాలా ఇబ్బందులు, ఎన్నో సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ విషయాలు వెంటనే బయటకు రాకపోయినా సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వస్తుంటాయి. ఇప్పుడలాంటి ఓ సందర్భాన్నే రానా దగ్గుబాటి(Rana Daggubati) బయటపెట్టాడు.
రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ రానా తన జీవితంలో జరిగిన ఓ మర్చిపోలేని సిట్యుయేషన్ ను షేర్ చేసుకున్నారు. రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య(Aranya) మూవీ షూటింగ్ టైమ్ లో తాను అనుకోకుండా ఓ సిట్యుయేషన్ లో ఇరుక్కుపోయానని, ఆ సినిమా ఎక్కువగా అడవిలోనే షూటింగ్ జరగ్గా, కొన్ని సీన్స్ ను ఏనుగులతో చేయాల్సి ఉండటంతో ఆ ఏరియాకు వెళ్లినట్టు చెప్పాడు.
షూటింగ్ కు వెళ్లే ముందే అక్కడి వాళ్లు సాయంత్రానికి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని, కానీ ఓ రోజు షూటింగ్ లేట్ అవడం వల్ల రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందని, సడెన్ గా అక్కడి వారంతా ఫాస్ట్ గా వెళ్తుండటం చూసి ఏమైందని చూస్తే ఏనుగులు తమ వైపుకు రావడం చూశానని, దీంతో అందరూ ఏనుగులకు కనిపించకుండా మూడు గంటల పాటూ చెట్ల వెనుక దాక్కుని ఎలాంటి సౌండ్ చేయకుండా ఉన్నామని, అడవి అంత భయంకరంగా ఉంటుందని తనకప్పుడే తెలిసిందని రానా చెప్పుకొచ్చాడు.






