Mega Heroes: పాటలతో అదరగొడుతున్న మెగా హీరోలు
కొత్త సంవత్సరం రావడానికి ముస్తాబవుతోంది. న్యూ ఇయర్ మొదటి త్రైమాసికంలో తమ సినిమాలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలని మెగా హీరోలు ఎంతో ఆశగా ఉన్నారు. అందులో భాగంగానే చిరంజీవి(Chiranjeevi) మన శంకరవరప్రసాద్ గారు(MSG), రామ్ చరణ్(Ram Charan) పెద్ది(Peddi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
తమ సినిమాల రిలీజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర మేకర్స్ తమ తమ సినిమాల నుంచి సాంగ్స్ ను రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందులో భాగంగా మొదటిగా వచ్చిన మీసాల పిల్ల(Meesala pilla) సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఆ తర్వాత పెద్ది నుంచి వచ్చిన చికిరి(Chikiri) సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది.
ఇప్పుడు రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్(UBS) లోని దేఖ్లేంగే సాలా(Dekhlenge sala) సాంగ్ రిలీజవగా ఆ సాంగ్ కూడా ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ మూడు పాటలు కేవలం ట్యూన్ మాత్రమే కాకుండా ఆ సాంగ్ లో ఆయా హీరోలు వేసిన స్టెప్పులు కూడా ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పుడే ఈ సాంగ్స్ ఇంత ఫేమస్ అయితే ఇక సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటలకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






