MSG: ఇద్దరు పిల్లలకు తండ్రిగా చిరంజీవి
చిరంజీవి(Chiranjeevi) హీరోగా టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad garu). నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Venkatesh) 20 నిమిషాల పాటూ ఓ అద్భుతమైన క్యామియో చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్(shine screens), గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్(gold box entertainments)బ్యానర్ లో సాహు గారపాటి(Sahu garapati, కొణిదెల సుస్మిత(Konidela susmitha) ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, ఆ ప్రెస్ మీట్ లో అనిల్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో అప్డేడెట్ వెర్షన్ చిరంజీవిని ఆడియన్స్ కు చూపించనున్నానని, ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) మూవీ కంటే డెప్త్ గా ఉంటుందని అనిల్ చెప్పాడు.
మన శంకరవరప్రసాద్ గారు మూవీలో ఫన్ ఎలిమెంట్స్, వినోదంతో పాటూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే డ్రామా కూడా ఉంటుందని, ఈ సినిమాలో చిరంజీవికి ఇద్దరు పిల్లలుంటారని, వారితో వచ్చే సీన్స్, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని, సంక్రాంతికి ఆడియన్స్ కు నవ్వుల పండగ ఖాయమని అనిల్ హామీ ఇచ్చాడు.






