Anil Ravipudi: అవన్నీ పట్టించుకోను
పటాస్(patas) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత తాను తీసిన ప్రతీ సినిమా ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడికి టాలీవుడ్ హిట్ మిషన్ అనే పేరుంది.
అయితే అనిల్ ఎన్ని హిట్ సినిమాలు చేసినా, అతని సినిమాలకు ఎన్ని కలెక్షన్లు వచ్చినా ఓ వర్గం ప్రజలు మాత్రం అనిల్ సినిమాల్లోని కామెడీని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ కామెంట్స్ విన్నప్పటికీ అనిల్ ఎప్పుడూ వాటిపై రియాక్ట్ అయింది లేదు. కాగా తాజాగా అనిల్ దీనిపై రెస్పాండ్ పై అందరికీ క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నేచురల్ అని, కానీ తాను కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముతానని, సినిమా క్వాలిటీ విషయంలో కూడా తానెప్పుడూ కాంప్రమైజ్ అవనని, అవసరమైన చోట మాత్రమే తాను ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా మన శంకరవరప్రసాద్ గారు(MSG) సినిమా చేస్తుండగా ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.






