Anil Ravipudi: చిన్నప్పటి నుంచే మూవీ బఫ్ని
టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పటాస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన అనిల్ ఇప్పటివరకు తను తీసిన ప్రతీ సినిమాతో ఒకదాన్ని మించి మరొకటి హిట్ అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో మన శంకర వరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) సినిమా చేస్తున్న అనిల్ రీసెంట్ గా జరిగిన మూవీ ప్రెస్మీట్ లో తన చిన్న నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
చిన్నప్పుడు స్కూల్లో తాను ఎన్నో చిరంజీవి సాంగ్స్ కు డ్యాన్సులేశానని, ఆయన సినిమాల్లో ఉండే కామెడీ, ఆయన కామెడీ టైమింగ్ తెలియకుండానే తనపై ఇన్ఫ్లుయెన్స్ చూపించాయని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తాను మూవీ బఫ్ ను అని కూడా అనిల్ ఈ సందర్భంగా చెప్పాడు. తాను 5వ క్లాస్ చదివే రోజుల్లో క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమాకు తీసుకెళ్తామని చెప్పడంతో బాగా చదివి క్లాస్ ఫస్ట్ వచ్చాననే విషయాన్ని అనిల్ ఈ సందర్భంగా బయటపెట్టాడు.
అలా 52 వారాలు 52 సినిమాలు చూశానని, ఆ వారం ఎవరి సినిమా ఉంటే వారి సినిమా చూసేవాడినని, అలా థియేటర్ వైబ్ తో తనకు బాగా కనెక్షన్ ఏర్పడిందని, ఆ రోజుల్లో మాస్ ఆడియన్స్ ను చిరూ సినిమాలు పిచ్చెక్కించేవని, చిరంజీవి రీఎంట్రీ తర్వాత వింటేజ్ చిరూ(chiru)ని అతని ఫ్యాన్స్ మిస్ అయ్యారనిపించి ఈ సినిమా చేస్తున్నానని, ఈ మూవీతో చిరంజీవి అందరినీ సర్ప్రైజ్ చేస్తారని అనిల్ చెప్పాడు.






