CGATNGA: “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” చిత్రం నుంచి మొదటి పాట విడుదల

ఎమ్3 మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి మరియు నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా నాయుడు హీరో, హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ చిత్రం నుండి మొదటి పాట “ఎంత ముద్దుగున్నావే”ను అమెరికాలో జరిగిన తానా (Telugu Association of North America) మరియు నాట్స్ (North America Telugu Society) వేడుకలలో, వేలాది మంది ప్రవాస భారతీయుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
ఈ పాటను కె వి జె దాస్ అద్భుతంగా స్వరపరచగా, సింగర్ రఘు కుంచే గారు ఫుల్ జోష్ తో పాటను పాడారు. డాన్స్ మాస్టర్ గోవింద్ తన గ్రూప్ డాన్సర్స్ తో కలిసి ఈ పాట కోసం అత్యద్భుతమైన కొరియోగ్రఫీ రూపొందించారు. పాటలో అమర్‌దీప్ చౌదరి మరియు సుప్రీతా నాయుడు చేసిన “ఉల్టా ఫల్టా” హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.
ఈ పాటలో విజువల్స్, రొమాన్స్, కెమిస్ట్రీ, మరియు మ్యూజిక్ అన్ని కలిసి యూత్ ని ఊపేస్తున్నాయి. పాట విడుదల తో సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “ఈరోజు “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” చిత్రం నుంచి “ఎంత ముద్దుగున్నావే” అనే మొదటి పాటను అమెరికా లో అంగరంగ వైభవంగా జరుగుతున్న తానా మరియు నాట్స్ మహాసభల్లో వేలాది మంది ప్రవాస భారతీయుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. మా పాట చూసి అందరు మా పాట ని కొనియాడారు. ప్రస్తుతానికి మా చిత్రం నిర్మాణాంతర పనుల్లో నిమగ్నమై ఉంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.