Bhadrakali: ‘భద్రకాళి’ ఖచ్చితంగా ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’ (Bhadrakali)తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశాను. ఇంజనీరింగ్ సమయంలోనే నాకు సినిమా పట్ల చాలా ఆసక్తి ఉండేది. థియేటర్స్ ప్లేస్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కెమెరా ముందు నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. కొన్ని టీవీ కమర్షియల్స్ కూడా చేశాను.
అరుణ్ గారి డైరెక్షన్ టీం నుంచి ఈ సినిమా కోసం ఆడిషన్ కాల్ వచ్చింది. తర్వాత అడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఓకే చేశారు. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు.
ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అందరు చాలా సపోర్ట్ చేశారు.
తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాల్ని గొప్పగా ఆదరిస్తారు. సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కూడా ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రియా జిత్తు మాట్లాడుతూ.. నేను మలయాళీ. తమిళ్, మలయాళీ సినిమాలు చూస్తూ పెరిగాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు అనుభవం ఉంది. దాదాపు 15 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని చదువుపై దృష్టి పెట్టాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.
విజయ్ ఆంటోనీ గారి 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాను. ఆయన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం.
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. విజయ్ గారు చాలా హంబుల్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
డైరెక్టర్ అరుణ్ గారు చాలా క్లారిటీ ఉన్న మేకర్. మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు నిర్మాతలు.
ఇది చాలా ఇంపాక్ట్ ఫుల్ కథ. ఇలాంటి కథ సొసైటీ కి చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలని ఆదరిస్తారు. భద్రకాళి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న సినిమా. తప్పకుండా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను.