TGFA: నా తండ్రిగారి పేరున ఇచ్చే ఈ అవార్డు నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం – బాలకృష్ణ

బాలకృష్ణ (Balakrishna) మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరుమీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం. గద్దర్ అవార్డుల సమయంలో నాకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ నేషనల్ అవార్డు (NTR National Award) ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొదటిసారి ఈ అవార్డు నాకు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డుకు ఇచ్చిన డబ్బులు నా బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఇస్తున్నాను అంటూ తన తండ్రి ఎన్టీఆర్ గారిని పొగిడారు. అలాగే చివర్లో జై తెలంగాణ అంటూ ముగించారు. 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని నటుడు బాలకృష్ణకు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో నటసింహ బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చిన సత్కరించారు.
ఈ సందర్భంగా బాలయ్య ప్రసంగించారు. అయితే.. స్పీచ్‌లో ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్పి ధన్యవాదాలు చెప్పిన బాలయ్య.. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరు చెప్పేందుకు కాస్త టైం తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరుమీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం. గద్దర్ అవార్డుల సమయంలో నాకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొదటిసారి ఈ అవార్డు నాకు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డుకు ఇచ్చిన డబ్బులు నా బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఇస్తున్నాను అంటూ తన తండ్రి ఎన్టీఆర్ గారిని పొగిడారు. అలాగే చివర్లో జై తెలంగాణ అంటూ ముగించారు.