Anil Ravipudi: నయనతార ఒప్పుకోకపోతే అదే చేసేవాడిని
చిరంజీవి(chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు(MSG). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. మరోసారి సంక్రాంతి సీజన్ లో అనిల్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని హిట్ మిషన్ గా కంటిన్యూ అవుతున్నాడు. మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి.
నయనతార(Nayanthara) ఏ సినిమానూ అంత ఈజీగా ఒప్పుకోదు. అలాంటి తనను ఈ సినిమాకు ఎలా ఒప్పించావని అడిగితే దానికి అనిల్ చెప్పిన ఆన్సర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మెగాస్టార్ కళ్లలోకి చూస్తూ, ఆయనకు వేలు చూపించే అమ్మాయి క్యారెక్టర్ లో మామూలు హీరోయిన్ ను పెడితే మొదటికే మోసం వస్తుందనిపించి, ఎవరైనా పెద్ద హీరోయిన్ ను తీసుకోవాలనిపించిందని, అప్పుడే నయనతార గుర్తొచ్చిందని అనిల్ చెప్పాడు.
ఈ విషయాన్ని సాహు, సుస్మితకు చెప్పగానే వారు నయనతార కోసం చాలా ట్రై చేశారని, తర్వాత తాను నయనతారకు కాల్ చేసి ఫోన్ లో కథ చెప్పానని, కథ ఆమెకు చాలా బాగా నచ్చిందని, చిరంజీవి గారితో మూవీ చేయాలనుందని, అందులో వెంకటేష్ గారు కూడా ఉండటంతో ఈ సినిమా చేయాలనుకుంటున్నానని, కానీ కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయని చెప్పారని అనిల్ చెప్పాడు. ఒకవేళ నేను ఈ సినిమా చేయకపోతే నువ్వేం చేస్తావని కూడా నయనతార తనను అడిగిందని, అప్పుడు తాను దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా అసలు నేను నయనతారకు కాల్ చేయలేదు, ఆమెకు కథ చెప్పలేదనుకుని ప్రశాంతంగా పడుకుంటానని చెప్పాడు. ఆ మాటకు వెంటనే నయనతార నవ్వి, మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పిందని అనిల్ వెల్లడించాడు.






