Anil Kapoor: ఎన్టీఆర్ తో మరో సినిమా కూడా!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్(Dragon). ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్(Anil Kapoor) నటిస్తున్నాడనే వార్త ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిటీని అనీల్ ఇచ్చారు. డ్రాగన్ సినిమాలో తాను నటిస్తున్నానని ఇన్స్టా స్టోరీ లో చెప్పిన అనీల్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా రివీల్ చేశారు.
ఆల్రెడీ వార్2(War2) సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనీల్ కపూర్ కు ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమా రెండోది. పైగా యానిమల్ తర్వాత అనీల్ కపూర్ సౌత్ డైరెక్టర్ తో కలిసి చేస్తున్న రెండో సినిమా కూడా డ్రాగనే. అయితే వార్2, డ్రాగన్ కాకుండా మరో ప్రాజెక్టులో కూడా అనీల్ కపూర్, ఎన్టీఆర్ తో కలిసి నటించనున్నట్టు చెప్పారు.
దీంతో ఆ మూడో సినిమా ఏంటా అని తెలుసుకోవడానికి అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు అప్పుడే సోషల్ మీడియాలో తమ ఊహాగానాలను షేర్ చేసుకుంటున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్(YRF) నిర్మాణంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడని వస్తున్న వార్తలు రాగా, ఆ సినిమాలో అనీల్ కపూర్ కూడా నటించనున్నారేమో అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు చెప్పలేం.






