Amina Nijam: ఇండియన్ ఆర్మీపై మల్లూ నటి అసహనం.. విమర్శిస్తున్న నెటిజన్లు
మలయాళ నటి అమీనా నిజమ్(amina nijam) తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వల్ల ఇప్పుడామె అందరి నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. టర్కిష్ తర్కం(Turkish Tarkam), గ్యాంగ్స్ ఆఫ్ 18(Gangs Of 18) సినిమాలతో మంచి పాపులారిటీని అందుకున్న అమీనా రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన పోస్ట్ అందరిలోనూ ఆగ్రహ జ్వాలలను రేపుతుంది.
ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ లోని ప్రజలను చంపడంపై తాను సిగ్గు పడుతున్నానని చెప్తూ అమీనా తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ విషయంలో అమీనాను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ పాక్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన 26 మంది ఇండియన్స్ ప్రాణాలు కోల్పోయినప్పుడు నువ్వేం చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియా మీద, ఇండియన్ ఆర్మీ మీద ఇలాంటి అభిప్రాయాలున్న అమీనాకు ఇకముందు ఎవరూ ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఫిల్మ్ మేకర్స్ ను నెటిజన్లు కోరుతూ ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ కూడా అమీనా వ్యాఖ్యలను సపోర్ట్ చేయడం లేదు. ఇండియన్ ఆర్మీ ఓ డెసిషన్ తీసుకుని దేశ భద్రత కోసం పాటుపడుతున్న వేళ అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని చెప్తూ ఆమె కామెంట్స్ ను తప్పుబడుతున్నారు.






