Sree Vishnu: ఆయ్ డైరెక్టర్ తో శ్రీవిష్ణు?
పోయిన ఏడాది ఆగస్టు రెండో వారంలో మంచి పోటీ మధ్య వచ్చిన ఆయ్(Aay) సినిమా ఆ పోటీని తట్టుకుని నిలబడటమే కాకుండా ఆడియన్స్ అందరినీ అలరించి విజేతగా కూడా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన ఆయ్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లను చూసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది అంజి(anji) అనే కొత్త డైరెక్టర్.
మొదటి సినిమా అయినప్పటికీ అంజి ఆయ్ తో మంచి మార్క్ వేయగలిగాడు. తనదైన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల్ని శాటిస్ఫై చేసిన అంజి ఇప్పటివరకు తన రెండో సినిమాను మొదలుపెట్టలేదు. అయితే ఇప్పుడు అంజి రెండో సినిమాకు సంబంధించిన రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయ్ సినిమా చేసిన గీతా ఆర్ట్స్ లోనే అంజి రెండో సినిమా చేయబోతున్నాడని సమాచారం.
అయితే ఈసారి హీరోగా ఫుల్ జోష్ లో ఉన్న శ్రీవిష్ణు(Sree Vishnu) తో అంజి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణుకు కూడా సింగిల్(Single) సినిమాతో గీతా ఆర్ట్స్(Geetha Arts) తో మంచి అనుబంధం ఏర్పడింది. మరోవైపు సింగిల్ సినిమా బాగా ఆడి అటు హీరో మార్కెట్ ను పెంచడంతో పాటూ ఇటు గీతా ఆర్ట్స్ కు కూడా మంచి లాభాలను మిగల్చడంతో మరోసారి వీరిద్దరూ కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే అంజితో శ్రీవిష్ణు సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశాలున్నాయి.






