Border2: బోర్డర్2 లో 9 పాటలు
జనవరి నెలలో బాలీవుడ్ లో రాబోతున్న భారీ సినిమాల్లో బోర్డర్2(border2) కూడా ఒకటి. సన్నీ డియోల్(Sunney Deol), దిల్జిత్ దోసాంజ్(Diljeeth dosanj), వరుణ్ ధావన్(Varun Dhawan), అహాన్ శెట్టి(Ahaan Shetty) నటిస్తున్న ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా బోర్డర్2 ప్రేక్షకుల ముందుకు రానుంది. బోర్డర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి ఆసక్తి నెలకొంది.
దానికి తోడు మంచి క్యాస్టింగ్ కూడా ఉండటంతో బోర్డర్2కు మంచి బజ్ ఉంది. ఇదిలా ఉంటే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా చిత్ర ఆల్బమ్ ను రిలీజ్ చేయగా అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో ఏకంగా 9 పాటలుండటాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. 9 పాటల రన్ టైమ్ మొత్తం కలిపి 50 నిమిషాలకు పైగా ఉండటం విశేషం.
బోర్డర్2 రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలని తెలుస్తోంది. ఇందులో 50 నిమిషాలు పాటలకే పోతే మిగిలిన సినిమా తక్కువేనని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం సాంగ్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే అదే బోర్డర్2 కు పెద్ద ప్లస్ అయ్యే అవకాశముందని అంటున్నారు. ఏదేమైనా ఆడియన్స్ కు బోర్డర్2 ఆల్బమ్ కనెక్ట్ అయితే సినిమాపై ఉన్న హైప్ మరింత పెరుగుతుంది లేదంటే త్వరలో రాబోయే ట్రైలర్ పై ఇంకాస్త బరువు పెరుగుతుంది.






