34 ఏళ్ల ప్రయాణంలో సక్సెస్ సర్ నేమ్‌తో ప్రసిద్ధికెక్కిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంటకేష్... విజయాలను తన ఇంటి పేరుగా మార్చుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు. సక్సెస్ కోసం ఎంతో మంది హీరోలు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. మరి వెంకటేష్ విక్టరీ అనే సక్సెస్‌పుల్ పేరుని తన స్క్రీన్‌నేమ్‌గా మార్చుకోవడం వెనుక చాలా పెద్ద కృషి, పట్టుదల, శ్రమ ఉంది. ఈ ఆగస్ట్ 14కి ఆంటే వెంకటేశ్ తన ప్రయాణాన్ని ప్రారంభించి 34 ఏళ్లు అవుతున్నాయి. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన చవిచూసిన అనుభవాలెన్నో.. నేర్చుకున్న పాఠాలెన్నో.. ఇవన్నీ సినిమాల్లోకి వచ్చి ఏదో సాధించాలనుకునే నేటి తరం యువత నేర్చుకోవాల్సిన విషయాలు తెలుగు సినిమా చరిత్రలో ఇంత లాంగ్ జర్నీ వున్న వ్యక్తి కూడా వెంకటేశ్. ఎప్పుడూ తనో టాప్ హీరో.. ఏదో సాధించేశాననే అనే గొప్పలకు వెళ్ళడు. అందుకనే ఆయన ఇప్పటికీ కొత్త తరహా కథల్లో, విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోతుంటారు. ఎలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆయన ప్రారంభం నుండి వేసుకున్న బాటే అందుకు కారణం. కథల ఎంపికలో మొనాటనీ కనిపించకుండా ఉండటానికి వెంకటేష్ అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. మాస్, క్లాస్, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన హీరోగా పదిలమైన స్థానాన్ని దక్కించుకోవడం వెంకటేశ్‌కు మాత్రమే సాధ్యమైంది.
మూవీ మొఘల్ రామానాయుడు తనయుడైనా… టాలీవుడ్ సినీ చరిత్రలోనే సువర్ణ అక్షరాతో లిఖించే అగ్ర నిర్మాత వరుసలో ముందుండే వ్యక్తి మూవీ మొఘల్ డి.రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు వెంకటేశ్. అప్పటికే అన్నయ్య డి.సురేశ్‌బాబు నిర్మాణ రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తండ్రి, అన్నయ్య తరహాలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనుకోలేదు. కోట్లాది మంది గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించాలనుకునే హీరో కావానుకున్నారు. అప్పటికే అగ్ర నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్‌లో రూపొందిన కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తొలి ప్రయాణాన్ని ఆరంభించారు వెంకటేశ్. హీరోగా అటు మాస్, ఇటు క్లాస్ అంశాను కలిగలిపి కమర్షియల్ కోణంలో ఆవిష్కరించే దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించారు. నాటి యువతరం భావాలకు అద్దం పట్టేలా విజయ్ అనే పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా ఒదిగిపోయి సూపర్‌హిట్‌ను సాధించడమే కాదు..తొలి చిత్రం తోనే హీరోగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే వెంకటేశ్ హీరోగా కంటే ముందు ఓ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేయడం విశేషం. సెన్సేషనల్ మూవీ ప్రేమనగర్‌లో బాలనటుడిగా వెంకటేశ్ నటించడం కొసమెరుపు.
వైవిధ్యమైన చిత్రాలకే ప్రాధాన్యత… 1986 ‘కలియుగ పాండవులు ’తో మంచి పునాది వేసుకున్న వెంకటేశ్ తర్వాత బ్రహ్మరుద్రులు , భారతంలో అర్జునుడు, విజేత విక్రమ్, శ్రీనివాస కల్యాణం, రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, స్వర్ణ కమలం , వారసుడొచ్చాడు, ప్రేమ, ధృవనక్షత్రం, టూ టౌన్ రౌడీ వంటి వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాల , ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో సక్సెస్‌ను సాధించడమే కాదు.. హీరోగా ప్రేక్షకుల గుండెల్లో ఉన్నత స్థానాన్ని దక్కించుకున్నారు. కలియుగ పాండవులు విడుదలైన నాలుగేళ్ళ తర్వాత వచ్చిన బొబ్బిలిరాజాతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించాడు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి అగ్ర కథానాయకుడయ్యారు వెంకటేశ్. తర్వాత అన్యాయాలపై తిరగబడే యంగ్ లాయర్‌గా శత్రువు చిత్రంతో నటుడిగా పేరు తెచ్చుకుని సూపర్‌హిట్‌ను దక్కించుకున్నారు. అదే ఏడాది వచ్చిన కూలీ నెం.1 చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను క్లొగొట్టారు విక్టరీ. అక్కడ నుండి వెంకటేశ్ తన గేరు మార్చారు.
విభిన్నమైన చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అన్యాయాలపై తిరగబడే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో సూర్య ఐపీయస్ చిత్రంతో ఆకట్టుకున్న వెంకటేశ్.. చంటి అనే అమాయకుడైన యువకుడిగా ఒదిగిపోయారు వెంకటేశ్. వెంకటేశ్ తప్ప తెలుగు లో ఆ పాత్రను మరొకరు చేయలేరు అనేంత గొప్పగా చేయడం ఆయనకే చెల్లింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తోఇండస్ట్రీ హిట్‌ను సాధించారు వెంకీ. అలాగే చినరాయుడుగా మెప్పించిన వెంకీ స్టార్ హీరో సుందరకాండలో లెక్చరర్ పాత్రతో సూపర్ డూపర్‌హిట్‌ను సాధించారు. స్నేహితుడు చేసిన అన్యాయంపై ఎదురుతిరిగి విజయం సాధించే కొండపల్లి రాజాగా అకట్టుకున్న వెంకటేశ్ అబ్బాయిగారు చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. దుర్మార్గుల ఆట కట్టించే సూపర్ పోలీస్‌గా, ఇద్దరు ముద్దుగుమ్మ ముద్దు ప్రియుడుగా, సరదా సరదాగా ఉండే పోకిరి రాజాగా.. ఇలా ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోయి ప్రేక్షకును మెప్పించారు
విక్టరీ వెంకటేశ్. అలాగే సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సాహసవీరుడు సాగరకన్య చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న వెంకటేశ్ అన్యాయాను ఎదిరించే లాయర్ రాకేష్‌గా ధర్మచక్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ వెంటనే ఇద్దరు భార్యల మధ్య మానసికంగా నలిగిపోతూ ప్రేక్షకులను నవ్వించిన భర్త పాత్రలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బంపర్ హిట్‌తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. సరదాబుల్లోడుగా అలరించిన వెంకటేశ్ తర్వాత పవిత్ర బంధం సినిమాలో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. చిన్నబాబు గా ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేశ్ తర్వాత ప్రేమించుకుందాం రా తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు.
ప్రేమ, రాయసీమ ఫ్యాక్షనిజం అనే అంశాలను మిక్స్ చేసి తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ మూవీగా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తర్వాత మెడికల్ మాఫియాను ప్రశ్నిస్తూ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటించిన గణేశ్ చిత్రం అప్పట్లో ఓ పెద్ద సెన్సేషనల్‌గా నిలిచింది. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. గణేశ్’ డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అలాగే సూర్యవంశం, ప్రేమంటే ఇదేరా, రాజా, శీను చిత్రాతో వరుస విజయాలను సాధించి విక్టరీ పేరును సార్థకత చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబం, బంధాలు , అనుబంధాలు కలయికగా చేసిన కలిసుందాం రా ఫ్యామిలీ పిక్చర్స్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బ స్టర్‌గా నిలిచింది. వరుస సూపర్‌హిట్స్ కొట్టి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు.
బడుగువర్గాల ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టే మహాదేవ నాయుడుగా జయంమనదేరా చిత్రంతో సక్సెస్ కొట్టి, సైన్స్ ఫిక్షన్‌ల్ మూవీ దేవీ పుత్రుడు, డిఫరెంట్ లవ్‌అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేమతో సినిమాలు చేసిన వైవిధ్యమైన సినిమాు చేయడానికి తానెప్పుడూ ముందుంటానని రుజువు చేశారు వెంకటేశ్. నువ్వు నాకు నచ్చావ్‌తో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అలాగే మాస్ మూవీగా జెమినీ, స్నేహానికి సరికొత్త అర్థాన్ని చెప్పిన వసంతం చిత్రాతో మరోసారి తన విలక్షణతను చాటుకున్న విక్టరీ వెంకటేశ్ మల్లీశ్వరితో సెన్సేషనల్ హిట్ కొట్టారు. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌లో వెంకటేశ్ చెప్పిన డైలాగ్స్‌ను ఇప్పటికీ మరచిపోలేం. అలాగే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ రామచంద్రగా ఘర్షణ చిత్రంలో వెంకటేశ్ నటన ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది ట్రేడ్ మార్క్ మూవీగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సంక్రాంతితో మరో సక్సెస్‌న తన ఖాతాలో వేసుకున్న వెంకీ సుభాష్ చంద్రబోస్ చిత్రంలో స్వాతంత్య్ర యోధుడిగా కనపడి మెప్పించారు. పవర్‌ఫుల్ మాస్ హీరోగా లక్ష్మీ చిత్రంతో ఆకట్టుకున్న వెంకటేశ్ ఆ వెంటనే ఆడువారి మాటకు అర్థాలే వేరులే అనే డిఫరెంట్ వ్ ఎంటర్‌టైనర్‌లో నటించారు. వెంటనే రాయసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన తులసితో మరో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుని మరోసారి హ్యాట్రిక్ హీరోగా సత్తా చాటారు. చింతకాయల రవిగా నవ్వించిన వెంకటేశ్ హర్రర్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నాగవల్లీ చిత్రంలో డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు. స్టైలిష్ మూవీ షాడో తర్వాత కుటుంబం కోసం ఆరాట పడే మధ్య తరగతి తండ్రిగా దృశ్యం చిత్రంలో వైవిధ్యమైన నటనను కనపరిచి హిట్‌ను సొంతం చేసుకున్నారు. నవ్విస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాబుబంగారంగా నవ్వించిన వెంకటేశ్.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో డిఫరెంట్ మూవీ గురులో నటించి హిట్ కొట్టారు.
ఈ సినిమాలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్‌గా కనిపించడం విశేషం. గత ఏడాది సంక్రాంతికి ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్2’ మరో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నారప్పగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈ 34 ఏళ్ల కెరీర్‌లో హీరోగా డిఫరెంట్ పాత్రలు , సినిమాలు చేసిన వెంకటేశ్ బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకును మెప్పించారు. అలాగే మల్టీస్టారర్ చిత్రాల్లోనూ నటించిన తన మార్కు క్రియేట్ చేశారు విక్టరీ వెంకటేశ్…
బాలీవుడ్‌లోనూ… తెలుగు లో సూపర్‌డూపర్ హిట్ అయిన చంటి చిత్రాన్ని హిందీలో అనారి అనే పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే సోషయో ఫాంటసీ యమలీల చిత్రాన్ని తక్‌దీర్‌వాలా అనే పేరుతో బాలీవుడ్‌లోనూ రాణించారు. మల్టీస్టారర్ హీరో… కెరీర్ ప్రారంభంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో వెంకటేశ్ ‘బహ్రరుద్రులు ’ వంటి మల్టీస్టారర్‌లోనటించి హిట్ కొట్టారు. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రాలకు గ్యాప్ వచ్చింది. సూపర్‌స్టార్ మహేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మల్టీస్టారర్ చిత్రాకు మళ్లీ ఊపందించారు. అలాగే కమల్‌హాసన్‌తో ఈనాడు చిత్రం, ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి మసాలా, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి గోపాల గోపాల. వరుణ్ తేజ్‌తో ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి అలరించారు.
అవార్డ్స్… 1986లో వెంకటేష్ హీరోగా పరిచయమైన ‘కలియుగ పాండవు’తోనే నంది అవార్డును కైవసం చేసుకున్న వెంకటేష్ 1988లో ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది స్వర్ణ కమం చిత్రంతో మరోసారి బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును సంపాదించుకున్నారు. 1989లో ప్రేమ చిత్రంతో నంది అవార్డును సాధించిన విక్టరీ వెంకటేష్ 1995లో విడుదలైన ధర్మచక్రం సినిమాతో నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును సంపాదించుకున్నారు. 1998లో విడుదలైన గణేష్ చిత్రంతో మరోసారి నంది అవార్డును, ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రాజా, కలిసుందాం రా, సంక్రాంతి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను సాధించిన వెంకటేష్ తర్వాత ఆడవాళ్ళ మాటకు అర్థాలే వేరులే చిత్రానికి నంది అవార్డును, 2015లో విడుదలైన దృశ్యం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
మేనళ్లుడు తో సందడి.. మేనళ్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి వెంకటేశ్ రెండు చిత్రాల్లో నటించారు. ప్రేమమ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్‌లో, అలరించిన వెంకీ మామ అల్లుళ్ళు గత ఏడాది వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వెంకీమామ మల్టీస్టారర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు.
వైవిధ్యమైన చిత్రంగా నారప్ప ... విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లపై ఆహ్లాదకరమైన చిత్రాలను చేసే శ్రీకాంత్ అడ్డా దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ ులుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ అవుతుందని అభిమానులు కాన్ఫిడెంట్‌గా సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘కలియుగ పాండవులు ’ నుండి ‘నారప్ప’ వరకు 34 ఏళ్ల సుదీర్ఘమైన సినీ జర్నీ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సరదాగా, బాధ్యతగా, సిన్సియర్‌గా, డేడికేటెడ్‌గా వర్క్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిర్మాత కొడుకుగా హీరో గా చేస్తున్న వెంకటేష్ నిర్మాతల శ్రేయస్సు కోరే హీరోగా వెంకటేశ్ ఇండస్ట్రీ పురోగాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇప్పుడు నారప్పగా సంచన విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు. పలువురు ప్రముఖ నిర్మాతలు వెంకటేశ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. హీరోగా 34 పూర్తయినా కూడా ఇంకా ఈ క్రేజ్ ఉండటం గ్రేట్. అది విక్టరీ వెంకటేశ్ తన హార్డ్ వర్క్‌తో సుస్థిర స్థానం. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు టైమ్స్ .నెట్ అభినందనలు తెలియజేస్తోంది.