Roshan: శైలేష్-రోషన్ మూవీలో హీరోయిన్ ఎవరంటే?
శ్రీకాంత్(Srikanth) కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన రోషన్(Roshan) తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఛాంపియన్(Champion) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ ను అందుకున్న రోషన్, తన తర్వాతి సినిమాను శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
కన్నప్ప(Kannappa) సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ఈ సినిమాలో రోషన్ సరసన నటించనుందని తెలుస్తోంది. రోషన్ పక్కన ప్రీతి అయితే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి, కన్నప్పతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ భామ రోషన్ సినిమాలో ఎంపికైనట్టు సమాచారం.
ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు తీసిన శైలేష్ కొలను మొదటి సారి రోషన్ కోసం తన రూట్ ను మార్చి ప్రేమ కథను చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కాగా మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ(Nagavamsi) నిర్మిస్తున్నాడు. మరి శైలేష్, రోషన్ కు ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి.






