Pawan Kalyan: మోహన్ లాల్ ఫార్ములా ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలపై మళ్ళీ వెనకడుగు వేసినట్టుగానే కనపడుతోంది. ఎప్పుడో ఒక సినిమా చేసే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తారో అర్థం కాక అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే హీరోల సినిమాలు కనీసం ఏడాదికైనా ఒకటి రిలీజ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఇప్పటివరకు నాలుగేళ్లలో ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఒకపక్క రాజకీయాలు.. మరోపక్క పరిపాలనలో బిజీగా ఉండటంతో సినిమా షూటింగుకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేని పరిస్థితి.
పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చిన సరే ఆ డేట్స్ లో ఆయన షూటింగ్ కు హాజరవుతారా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం హరిహర వీరమల్లు(Hari hara veeramallu) సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలను వాయిదా వేసిన చిత్ర యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్లో ఓ జి అనే సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అనుకున్న డేట్ కంటే దాదాపు నాలుగు నెలలు తర్వాత ఈ సినిమా షూటింగ్ విజయవాడలో మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది రాకుండా సినిమా షూటింగ్ మొత్తం విజయవాడ లేదంటే ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మలయాళ సినిమా లూసిఫర్ మాదిరిగా సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేసి మిగిలిన షూటింగ్ ముంబై లేదా విదేశాలలో పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూటింగ్ ఆల్రెడీ కొంత పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ విశాఖ లేదా చిత్తూరులో జరిగే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ అయినా.. త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.