Allu Arjun: అల్లు అర్జున్ షాకింగ్ యాటిట్యూడ్

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వర్సెస్ అల్లు అర్జున్.. గా సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడంతో అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు. ఒక రాత్రి జైల్లో గడిపే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండటంతోనే అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అనేది అల్లు అర్జున్ అభిమానులలో ఉన్న ఆగ్రహం. ఈ వ్యవహారంలో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది.
ప్రతి చిన్న విషయంలో వినోదం కోరుకునే సోషల్ మీడియా జనాలు తాజాగా గద్దర్ అవార్డుల(Gaddar Awards) సందర్భంగా కూడా ఈ అంశంపై సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ వేదిక మీదకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి అభివాదం చేసే సమయంలో అల్లు అర్జున్ కాస్త దురుసుగా వ్యవహరించారని ఆరోపణ వినపడుతోంది. వేదిక మీద నుంచి వేగంగా దిగిపోవడం.. ప్రశంస పత్రాన్ని కూడా అందుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ప్రవర్తన బాలేదని కొంతమంది అంటే అతని ఇగో రేవంత్ రెడ్డి టచ్ చేసారని అందుకే అతను అలా బిహేవ్ చేశాడని మరికొంతమంది సమర్థిస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి చేసింది కరెక్టేనని.. ఇలా ప్రవర్తించే వాళ్లకు అలాగే చేయాలని.. అతను ఇంకా పుష్ప సినిమా మేనియా నుంచి బయటికి రాలేకపోతున్నాడని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అతని విషయంలో మరింత కఠినంగా ఉండటమే మంచిది అని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా అల్లు అర్జున్ వ్యవహార శైలి మాత్రం గద్దర్ అవార్డుల వేదికగా మరోసారి చర్చినియాంశంగా మారింది.