సెల్యులాయిడ్ సైంటిస్ట్ అక్కినేని నాగార్జున @61 ఈవెన్ నౌ హి ఈజ్ యంగ్

కింగ్ నాగార్జున…
ఈ పేరు వినగానే మనకు ఆహ్లాదమైన చిరు నవ్వుతో ఉన్న రూపమే గుర్తుకు వస్తుంది. ఎప్పుడూ కూల్‌గా, నవ్వుతూ, కామ్‌గా ఉండటమే కాకుండా ప్రాక్టికల్‌గా తను అనుకున్నది సాధించే పర్సనాలిటీ కింగ్ నాగార్జున. ఆగస్ట్ 29న నాగ్ బర్త్‌డే. ప్రతి ఏడు లెక్కకి ఓ సంవత్సరం వయసు పెరిగినా ఆయన మాత్రం మరింత యంగ్ అవుతుంటారు. ఆయన వయసుకి గ్లామర్‌కి మధ్య జరిగే పోటిలో ఎప్పుడూ గ్లామరే హైలెట్ అవుతుంది. అందుకే నాగార్జున ఎవర్‌గ్రీన్ గ్లామర్ కింగ్ అయ్యారు.
ఎక్స్‌పెరిమెంట్ కింగ్…
ఎప్పటికప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం నాగా ర్జునతత్వం అందుకే ఆయన ఎక్స్‌పెరిమెంట్ కింగ్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో తనే ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేయడంలో కింగ్ నాగార్జున కృషి ఎంతో ఉంది. భక్తిరస చిత్రాలు, మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు సరికొత్త ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ చిత్రాలు ఇలా అన్నీ రకాల చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్కును చూపించారు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా, ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితం కాకుండా. విలక్షణమైన కథ, కథనాల, క్యారెక్టరైజేషన్స్ ఉన్న సినిమాను ఎంపిక చేసుకుంటూ అందరి హీరోలతో పోటీపడి అన్నీ రకాల చిత్రాల్లో నటిస్తున్నారు. నటుడిగా, స్టూడియో అధినేతగా, నిర్మాతగా తనదైన మార్కును చూపిస్తూ తండ్రికి తగ్గ తనయుడని పించుకుంటున్నారు. అందుకే ఆయన ప్రేక్షకాబి óమాలను గుండెల్లో కింగ్‌గా చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు..
విక్రమ్ నుండి వైల్డ్‌డాగ్ వరకు…
తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన మెగునీడు చిత్రంలో ఎనిమిది నెలల వయసులోనే వెలుగునీడలు చిత్రం తో వెండితెరపై కనిపించారు నాగార్జున. తర్వాత సుడిగుండాులు చిత్రంలో బాలనటుడిగా మెప్పించారు. తర్వాత సినిమాల్లో నటించలేదు. పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టిన నాగార్జున 1986లో హీరోగా హిందీ చిత్రం ‘హీరో’ రీమేక్ తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి చిత్రం ‘విక్రమ్’ హీరోగా రంగ ప్రవేశం చేసి సంచన విజయం సాధించారు. నాలుగో చిత్రం మజ్నుతోనే ట్రాజెడీ కింగ్‌గా పేరున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ధీటుగా నటించి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. అంతే కాకుండా తండ్రితో అగ్నిపుత్రుడు, కలెక్టర్‌గారి అబ్బాయి చిత్రాల్లో పోటీ పడి నటించి ఇండస్ట్రీలోఅక్కినేని వారసుడిగా హీరోగా ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. కిరాయిదాదా, విక్కీదాదా వంటి మాస్ చిత్రాలతో, ఆఖరిపోరాటం వంటి విజువల్ వండర్‌తో, జానకిరాముడు వంటి మ్యూజికల్ లవ్‌స్టోరితో ఆల్‌రౌండర్‌గా తన సత్తాను చాటారు. ఎక్కడో తన కెరీర్‌పైనే తనకే అసంతృప్తి ఏర్పడి తనకు తాను కొత్త రకం సినిమా చేయాలనే తాపత్రయంతో ఏస్ డైరెక్టర్ మణిరత్నంను కలిసి రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచన వ్యక్తం చేశారు.
అలా నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం గీతాంజలి. మణిరత్నం డైరెక్ట్ చేసిన స్ట్రయిట్ తొలి తెలుగు మూవీ కూడా ఇదే. ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరి గీతాజంలితో యూత్ ఫేవరేట్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా లవ్‌స్టోరీస్‌లో ఇప్పటికీ ఓ క్లాసికల్ గా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలైన ఐదు నెలలకే గీతాంజలి చిత్రానికి కాంట్రస్ట్‌గా శివ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లవ్‌స్టోరీలో గీతాంజలి ట్రెండ్ క్రియేట్ చేస్తే యాక్షన్ మూవీలో శివ ఓ చరిత్రనే సృష్టించింది. ప్రేమ విలువను చెప్పిన సినిమా గీతాంజలి అయితే, సాంకేతిక పరంగా తెలుగు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిన సినిమా శివ. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత నాగార్జునకే దక్కింది. తెలుగు సినిమా పంథాను మార్చిన సినిమాగా, అసు సినిమాకి సౌండ్ ప్రాముఖ్యతను తెలియజేసిన సెన్సేషనల్ మూవీగా శివ నిలిచిపోయింది. తెలుగు సినిమా చరిత్ర గురుంచి రాస్తే టెక్నికల్ పరంగా శివ ముందు శివ తరువాత అని ల్యాండ్ మార్క్ గా శివ చిత్రం నిలిచిపోయింది.
తెలుగు లోనే కాదు హిందీలోనూ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాగార్జున రేంజ్‌ను బాలీవుడ్‌కు తెలిసేలా చేసింది శివ. ప్రెసిడెంటు గారి పెళ్లాం సినిమాతో విలేజ్ మాస్ కమర్షియల్ హిట్ సాధించిన నాగార్జున తర్వాత వారసుడు, అల్లరి అల్లుడు, ఘరానాబుల్లోడు, హలో బ్రదర్ చిత్రాలతో ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా మారారు. వైౖవిధ్యంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన, తాపత్రయంతో ఉండే నాగార్జున ఎంతో మంది దర్శకులను, సాంకేతిక నిపుణును తెలుగు సినిమాకు పరిచయం చేశారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను నిర్ణయంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే చైతన్య చిత్రంతో డైరెక్టర్ ప్రతాప్‌పోతన్, శాంతిక్రాంతితో రవిచంద్రన్, ప్రేమయుద్ధంతో రాజేంద్ర సింగ్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్‌భట్‌తో క్రిమినల్ సినిమా చేశారు. అలాగే చాలా మంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. ఉప్పపాటి నారాయణరావుతో జైత్రయాత్ర, రక్షణ సినిమాను చేశారు. దశరథ్‌ను సంతోషంతో దర్శకుడిగా పరిచయం చేశారు. రాఘవ లారెన్స్‌ను మాస్ చిత్రంతో డైరెక్టర్‌ను చేశారు. సీతారాము కల్యాణం చూతము రారండితో వై.వి.ఎస్.చౌదరి, ఉయ్యాల జంపాలాతో విరించి వర్మను కూడా నాగార్జునే పరిచయం చేశారు. మాస్ చేసిన సమయంలో దీనికి పూర్తి భిన్నంగా భక్తిరస చిత్రం శ్రీరామదాసు సినిమా చేశారు. అటు యాక్షన్ కింగ్‌గా మాస్‌తో ఇటు డివోషనల్ కింగ్‌గా శ్రీరామదాసుతో ప్రేక్షకులని ఆకట్టుకోవడం నాగార్జునకే సాధ్యం అయింది. అలాగే ఆయన కెరీర్‌లో చేసిన బెస్ట్ మూవీస్‌లో ఊపిరి సినిమా కూడా ఒకటని ఆయన చెబుతుంటారు.
జడ్జ్‌మెంట్‌లోనూ కింగే..
నటుడిగా సినిమా ఎంపికలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో నిర్మాత గానూ అంతే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. డెబ్యూ డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణతో సొగ్గాడే చిన్ని నాయనా సినిమా చేసి ఆడియో ఫంక్షన్ రోజే.. సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్‌హిట్ కొడుతున్నాం అని చెప్పి సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఇదే అని కాదు.. చాలా సందర్భాల్లో రిజల్ట్‌ను ముందుగానే చెప్పే జడ్జ్‌మెంట్ నాగ్ సొంతం.
అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ మూవీ మనం
అక్కినేని ఫ్యామిలీకి మనం ఓ మెమరబుల్ మూవీ. ఎందుకంటే ఎ.ఎన్.ఆర్ నటించిన చివరి చిత్రం. బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీలో మూడు తరాల నటులు కలసి నటించిన చిత్రం తర్వాత మూడు తరాల నటీనటులు కలిసి నటించిన చిత్రం మనం మాత్రం కావడం విశేషం. ఒక వైపు తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో, మరో వైపు తనయుడు అక్కినేని నాగచైతన్య, అఖిల్, కోడులు సమంత అక్కినేని ఇలా అక్కినేని కుటుంబ సభ్యులంతా కలిసి నటించి ప్రేక్షకాభిమానులకు కను విందు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ‘మనం’దరం ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా ఇది నిలిచింది.
భక్తిరస చిత్రాలు కూడా..
తండ్రి నుండి తీసుకున్న వారసత్వాన్ని మరో అడుగు పైకి తీసుకెళ్లి అభిమానులను అలరిస్తూ వైవిధ్యమైన సినిమాలు చేయడం నాగార్జునకే చెల్లింది. ఒకవైపు నిన్నే పెళ్లాడతా లాంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్‌బస్టర్ ఇచ్చి దాని కంటిన్యూషన్‌గా అన్నమయ్య లాంటి అపురూప భక్తిరస చిత్రంతో అఖండవిజయం సాధించిన ఘనత కింగ్ నాగ్‌కే దక్కింది. ఇప్పటి ట్రెండ్ కు తగిన సినిమాలు చేస్తూనే మరో పక్క భక్తిరస చిత్రాలకు పెద్ద పీట వేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శక త్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో నటుడుగా పరిపూర్ణతను సాధించారు.
బుల్లి తెరపై తొలి తెలుగు స్టార్‌గా సెన్సేషన్
సెన్సేషన్ క్రియేట్ చేయడం నాగార్జునకు కొత్తేం కాదు.. అందుకనే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేయడం ఆయనకే చెల్లిం ది. అందుకనే మారుతున్న నేటి జనరేషన్ స్టైల్లో వెండితెరపైనే కాదు బుల్లి తెరపై కూడా తను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున. నాగార్జున వ్యాఖ్యాతగా మా టివిలో ధారావాహికగా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ఆయనలోని మరో కోణాన్ని ఎలివేట్ చేసింది. సీజన్ 1,2, 3 వరుసగా మూడేళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్ప టి వరకు తెలుగు టీవీల్లో ఉన్న కమర్షియాలిటీకి భిన్నంగా రూపొందిన ఈ ప్రోగ్రాం సామాన్యులకు చేరువైందంటే కారణం నాగార్జునే. ఈ ప్రోగ్రాం మూడు సీజన్స్‌ను నాగ్ అద్భుతంగా సక్సెస్ చేశారు. ఏదో ప్రోగ్రాం చేస్తు న్నట్లు కాకుండా వారితో కలిసి పోయి, కుటుంబ సభ్యుడిలా వ్యవహ రిస్తూ నాగార్జున ప్రోగ్రాంను హ్యాండిల్ చేసిన తీరుకు మంచి స్పందన వచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లోనూ సెన్సేషన్..
తెలుగు బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్.. గత ఏడాది తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తనదైన స్టైల్లో బిగ్‌బాస్ సీజన్3ను విజయవంతం చేశారు కింగ్ నాగార్జున. ఈ ఏడాది పాండమిక్ సమయంలోనూ నాగార్జున బిగ్‌బాస్‌హౌస్‌లోకి మరోసారి ఎంట్రీ ఇస్తున్నారు. సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 4లో నాగార్జున కోసం ప్రేక్షకాభిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్కినేని వారసులు …
నట శిఖరం అక్కినేని వారసుడిగా తన బాధ్యతను నటుడిగా, నిర్మాతగా నాగార్జున అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నాగార్జున సోదరుడు వెంకట్ నిర్మాతగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించారు. సోదరి సుశీల కూడా సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. అలాగే నాగార్జున నట వారసుడిగా నాగచైతన్య ఇప్పటికే సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్‌స్టోరి విడుదకు సిద్దమవుతుంటే.. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తదుపరి సినిమా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. అలాగే రెండో తనయుడు అక్కినేని ‘అఖిల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకును మెప్పించారు. వచ్చే ఏడాదిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా మన ముందుకు రాబోతున్నారు. ఇక నాగార్జున కోడులు , చైతన్య సతీమణి సమంత అక్కినేని టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నారు. ఓ బేబీతో సెన్సేషనల్ హిట్ సాధించిన సమంత తదుపరి సినిమాకు సన్నద్ధమవు తున్నారు. మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ చిత్రాతో ప్రేక్షకును ఆకట్టుకున్న సుమంత్ ఇప్పుడు కపటధారి సినిమాతో మెప్పిం చడానికి రెడీ అవుతున్నారు. చిలసౌతో మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్ త్వరలోనే ఇచ్చట వాహనము నిలుపరాదు సినిమాతో సందడి చేయ బోతున్నారు. సుప్రియ అన్నపూర్ణ స్టూడియో బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా అక్కినేని కుటుంబ సభ్యుందరూ సినిమా పరిశ్రమ తోనే మమేకమైఉన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిన తొలినాళ్లలో రూపొందిన అన్నపూర్ణ స్టూడియో క్రమక్రమంగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కు చేరుకుం టుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బాహుబలి వంటి సినిమా డీఐ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరగడం విశేషం. అంతగా స్టూడియోను డెవలప్ చేసిన ఘనత నాగార్జునదే. ఎ.ఎన్.ఆర్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న స్టూడియో ను అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోను ప్రాణంగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా నాన్న స్థాపించిన అన్న పూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్‌ను శ్రీమతి అమలతో కలిసి ఎంతగానో అభివృద్ధి చేశారు. అక్కినేని పేరు మీద స్టార్ట్ చేసిన ఎ.ఎన్.ఆర్ నేషనల్ అవార్డును రెగ్యులర్‌గా అందిస్తూ ఎ.ఎన్.ఆర్‌కు ఘనంగా నివాళి ఇస్తుంటారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే చిత్రాల్లో ఎ.ఎన్.ఆర్ లివ్స్ ఆన్ అనే ఎప్పుడూ కనిపిస్తుంటుంది కానీ.. తండ్రి ఎ.ఎన్.ఆర్‌ను నాగార్జున మనసులో ఎ్లప్పుడూ తులచుకుంటూనే ఉంటారు. ఆ శక్తే నాగార్జునను, అన్నపూర్ణ స్టూడియోను ముందుకు నడిపిస్తోంది.
బాలీవుడ్‌లో కింగ్…
అగ్ర కథానాయకుల్లో ఎక్కువ బాలీవుడ్ సినిమాు చేసిన ఘనత కింగ్ నాగార్జునదే. ఇటు టాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే వీలున్నప్పుడు, కథ నచ్చినప్పుడల్లా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చారు. శివ, ఖుదాగవా, ద్రోహి, క్రిమినల్, మిస్టర్ బేచారా, అంగారే, జక్మ్, అగ్ని వర్ష, ఎల్‌ఓసీ కార్గిల్ చిత్రాల్లో నటించారు. దాదాపు 15 ఏళ్లు తర్వాత బ్రహ్మాస్త్ర చిత్రంతో మళ్ళి మనముందుకు వస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఖుదాగవా తర్వాత మరోసారి ఈ చిత్రం లో నటించారు. ఇందులో రణభీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇది ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది.
కరోనా అవేర్‌నెస్… సినీ కార్మికుకు అండగా..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో యావత్ ప్రపంచం స్తంభించింది. సినీ పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్స్ మూత పడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో కళామతల్లిని నమ్ముకున్న రోజువారీ కార్మికులకు పని లేకుండా పోయింది. అలాంటి సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి అధ్యక్షతన ఏర్పడిన సీసీసీ మనకోసం సంస్థకు అక్కినేని ఫ్యామిలీ తరపున నాగార్జున కోటి రూపాయ విరాళాన్ని అందజేశారు. దాదాపు పదిహేను వేలకుపైగా సినీ కార్మికుల కుటుంబాలను తగిన రీతిలో ఆదుకోవడానికి ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థలో నాగార్జున క్రియాశీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా ప్రజల్లో కరోనా అవేర్ నెస్ తీసుకురావడానికి ఎన్నింటినో చేపట్టారు. చిరంజీవి సహా మరి కొంత మంది హీరోతో కలిసి కోటి స్వరపరిచిన సాంగ్‌లో నాగార్జున పార్టిసిపేట్ చేశారు. అంతే కాకుండా కరోనా వైరస్ నియంత్రణకు ప్లాస్మాను దానం చేయాలని సైబరాబాద్ పోలీసు నిర్వహిస్తోన్న అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొని ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్‌గా ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణకు పాటు పడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులకు ప్రభుత్వ నియమాలు పాటిస్తూ ప్రజలు తోడ్పాటు అందించాని కోరారు. అంతే కాకుండా షూటింగ్‌ను పున: ప్రారంభిం చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌తో జరిగిన చర్చల్లో చిరంజీవితోపాటు పాల్గోన్నారు. ప్రస్తుతం మరో యంగ్ టాలెంట్ డైరెక్టర్ సాల్మోన్‌ను ఎంకరేజ్ చేస్తూ వైల్డ్‌డాగ్ అనే సరికొత్త యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం బ్యాన్స్‌వర్క్ త్వరలో ప్రారంభం అవుతుంది. అలాగే గరుడవేగ లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్, శరత్ మరార్ నిర్మిస్తోన్న చిత్రంలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు. సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ బంగార్రాజు సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా స్టార్ హీరోగా, నిర్మాతగా రాణిస్తోన్న టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు ఆగస్ట్ 29. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియ జేస్తోంది ‘తెలుగుటైమ్స్ .నెట్’.
….హ్యాపీ బర్త్ డే టు కింగ్ నాగార్జున….