Akkineni Nagarjuna: టీడీపీ కోసం నాగార్జున తపన, భయమా..? గౌరవమా…?

సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే సైలెంట్ గా రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా.. ఈ మధ్య కాస్త సంచలనవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)… అక్కినేని నాగార్జున విషయంలో సీరియస్ గా ఉండటం.. ఇటీవల కాస్త సంచలమైన విషయం గానే చెప్పుకోవాలి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడం చూసి సినిమా వాళ్లు కూడా షాక్ అయ్యారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కంగుతిన్నారు.
గత పదేళ్ళ నుంచి నుంచి ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ రెడ్డి గట్టిగానే పోరాటం చేస్తూ వచ్చారు. శాసనసభలో కూడా ఆయన పలుమార్లు దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తన అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జునకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారు రేవంత్ రెడ్డి. దీనితో నాగార్జున ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన బిజెపి పెద్దలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ని కలిశారు. దానికంటే ముందు డైరెక్ట్ గా పార్లమెంట్లోని టిడిపి కార్యాలయానికి నాగార్జున వెళ్లడం కాస్త సంచలనంగా చెప్పుకోవాలి. ఆ పార్టీ ఎంపీలతో నాగార్జున చాలా సన్నిహితంగా మెలిగారు.. ఇక నాగార్జున తో పాటుగా ప్రధానమంత్రి కార్యాలయానికి టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా వెళ్లారు. వాస్తవానికి నాగార్జున వైసీపీకి… ముఖ్యంగా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. జగన్ వ్యాపారాల్లో నిమ్మగడ్డ రమేష్ తో పాటుగా నాగార్జున కూడా భాగస్వామి.
అలాంటి నాగార్జున ఇప్పుడు టిడిపికి దగ్గర కావడం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తనని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే నాగార్జున జాగ్రత్తలు పడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రధానమంత్రి మోడీని కలవడం వెనుక అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్ కారణంగా చూపిస్తున్నా… టిడిపి ఆఫీసుకు వెళ్ళడం మాత్రం కాస్త సంచలనం చెప్పాలి.