Ameer khan: స్టార్ హీరో ఇంటికి 28 మంది ఐపిఎస్ లు, కారణం అదేనా..?

సినిమా వాళ్ళతో రాజకీయ నాయకులు, అధికారులు స్నేహం చేయడం అనేది సాధారణ విషయమే. కాని వాటిని కాస్త జాగ్రత్తగా బయటకు రాకుండా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అధికారుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉంటారు. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Ameer khan) ఇంటికి ఏకంగా 28 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. ఆయన ఇంట్లోకి వెళ్లి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
జాతీయ మీడియా కథనం ప్రకారం పెద్ద ఎత్తున ట్రైనీ ఐపిఎస్(IPS) అధికారులు అమీర్ ఖాన్ ఇంటికి వెళ్ళారు. దీనితో ఇంటి బయట పెద్ద కాన్వాయ్ కూడా ఉందట. జులె 27, ఆదివారం ఈ పరిణామం చోటు చేసుకుంది. తన ఇంటికి వచ్చిన అధికారులకు అమీర్ ఖాన్, లంచ్ కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. జులై 29న అమీర్ ఖాన్ నుంచి కీలక ప్రకటన రానుంది. ఆ ప్రకటనకు, ఐపిఎస్ అధికారులు అతని ఇంటికి వెళ్ళడానికి ఏదైనా సంబంధం ఉండవచ్చా అనే దానిపై జాతీయ మీడియా కూపీ లాగుతోంది.
అమీర్ ఖాన్ ఆఫీస్ నుంచి కూడా దీనిపై ఏ ప్రకటన రాలేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్ భారీ బడ్జెట్ సినిమా సితారే జమీన్ పర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను మూడో పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కిరణ్ రావుతో విడాకుల తర్వాత అమీర్ ఖాన్, బెంగళూరుకి చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. దీని తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించే బయోపిక్ లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను పోషించనున్నాడు. మూడేళ్ళ తర్వాత అమీర్ ఖాన్ సినిమా ఎంట్రీ ఇవ్వనున్నాడు.