Zuckerberg : జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరో 18 నెలల్లో మా కోడింగ్ పనంతా

మరో 18 నెలల్లో తమ కంపెనీకి చెందిన కోడింగ్ పనంతా కృత్రిమ మేధ (ఏఐ)నే చేస్తుందంటూ మెటా సీఈఓ జుకర్‌బర్గ్ (Zuckerberg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ (AI) ఇప్పటికే ఓ బృందంలో సభ్యుడిగా విధులు నిర్వహిస్తోందన్నారు. త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని తెలిపారు. బగ్‌లను కనుగొంటూ, అధిక నాణ్యత కోడ్‌ను స్వతంత్రంగా రాయగలదని జుకర్‌బర్గ్ భావిస్తున్నారు. రానున్న 12-18 నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలావరకు కోడిరగ్‌ను ఏఐయే పూర్తిచేస్తుందని అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల (Satyanadella) సైతం తమ కంపెనీకి సంబంధించి 20-30 శాతం కోడ్‌ను ఏఐతోనే సృష్టిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. గూగుల్ తన సాఫ్ట్‌వేర్ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఇప్పటికే వెల్లడిరచారు.