జూమ్ లో 1300 మందిపై వేటు
కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ జూమ్ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 1300 మందిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. ఇది సంస్థ ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. లేఆఫ్‌కు గురైన ఉద్యోగులకు మరో అరగంటలో మెయిల్ వస్తుందని జూమ్ సంస్థ సీఈవో ఎరిక్ యువాన్ కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ప్రకటించారు. అమెరికాలో లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు ప్రతిభావంతులని, కష్టపడి పని చేసే తత్వం ఉన్నవారిని ఆయన అభివర్ణించారు. అమెరికా బయట పనిచేసే ఉద్యోగుల విషయంలో స్థానిక నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోనస్, ఆరు నెలల పాటు స్టాక్ ఆప్షన్‌పై అధికారం ఇచ్చారు. అమెరికా బయట పనిచేసే వారికి ఆగస్టు 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. వీరికి స్థానిక చట్టాల ప్రకారమే వర్తిస్తుంది.






