ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్!

యాపిల్ సంస్థ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండు తెలిసిందే. ప్రస్తుతం టాప్ ఎండ్ ఐఫోన్ 15 ప్రొమ్యాక్స్ 6.7 అంగుళాల స్క్రీనుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ ఏకంగా 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రొమ్యాక్స్ ప్రతిరూపాన్ని రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. మిస్టర్‌హూజ్‌దబాస్ పేరిట సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్‌లో అరుణ్ పేరు పొందాదు. ఈ క్రమంలోనే మాథ్యూ పెర్క్స్ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్టుతో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని తయారు చేశాడు. ఇందులో భారీ కెమెరాలు అమర్చాడు. గేమింగ్ యాప్‌లనూ ఉపయోగించుకోవచ్చు.