Duba : వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన గోల్డ్ బార్.. ప్రపంచంలోనే

ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం కడ్డీని దుబాయ్ (Dubai) లో ప్రదర్శనకు పెట్టారు. వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ గోల్డ్ బార్ బరువు 300.12 కేజీలు. నాటి మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ అక్షరాలా రూ.211 కోట్లు. దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్‌టెన్షెన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఈ అతి పెద్ద బంగారు కడ్డి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్‌ఎల్‌సీ ఈ భారీ బంగారు కడ్డీని తయారు చేసింది. దుబాయ్‌లోని మింటింగ్ ఫ్యాక్టరీ దుకాణం వెలుపల గాజు పెట్టేలో ఈ బంగారు కడ్డీని భద్రపరిచారు. ఇప్పటి వరకు జపాన్ (Japan) లో ప్రదర్శించిన 250 కిలోల గోల్డ్ బార్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా వరల్డ్ రికార్డును కలిగి ఉన్నది. ఆ రికార్డును ఇప్పుడు ఈ కడ్డీ అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది.