కొత్త అవతారానికి రూ.53.60 లక్షల ఖర్చు చేసిన యువతి
జర్మనీకి చెందిన జెస్సీ బన్నీ వయసు 21. హ్యూమన్ బార్బీగా మారాలన్న తన కలను నిజం చేసుకోడానికి సొంత కుటుంబాన్ని వదిలి ఆస్ట్రియాలోని వియోన్నాకు వచ్చేసింది. సుమారు 53.60 లక్షలు (70 వేల డాలర్లు) వెచ్చించి మూడుసార్లు రొమ్ము పెరుగుదల శస్త్రచికిత్సలు చేయించుకుంది. పెదాలను పిరుదులను బొద్దుగా మార్చుకుంది. ఇన్స్టాగ్రాం ఖాతాలో తన శరీర కొలతలను వెల్లడిరచింది. అయితే రూపు మార్యుకున్న తర్వాత కుటుంబ సభ్యులెవరూ తనతో మాట్లాడటం లేదని వాపోయింది. డ్రైవింగ్ తరగతుల నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను కూడా రొమ్ము పెరుగుదల చికిత్సకు వెచ్చించినట్టు చెప్పిన జెస్సీ.. తాను ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, త్వరలోనే పూర్తిస్థాయి బేబీ డాల్ మాదిరి కనిపించేలా శరీరాన్ని మార్చెకుంటానని వెల్లడిరచింది.






