వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ త్వరలో నియర్‌బై షేరింగ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ సాయంతో కేబుల్స్, ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కనున్న వారికి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్టు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో వెల్లడిరచింది. ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి డివైజ్‌ను కదిపితే ( షేక్ చేస్తే) పక్కన ఉన్నవారికి షేర్ రిక్వెస్ట్ వెళ్తుందని, వారు దాన్ని ఆమోదిస్తే ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది.