వాట్సప్‌లో కొత్త ఫీచర్

యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను జోడిస్తూనే వస్తోంది. కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక సదుపాయాలు తీసుకొచ్చిన యాప్ తాజాగా కస్టమ్ లిస్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్లకు నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చని తెలిపింది. వాట్సప్ ఓపెన్ చేయగానే బోలెడన్ని కాంటాక్ట్స్ దర్శనమిస్తాయి. అందులోనే ఫ్రెండ్స్, వ్యక్తిగత చాట్‌లు, వృతిపరమైనవి లేదా వ్యాపారానికి సంబంధించినవి ఇలా అన్నీ కలిస ిఉంటాయి. మనకు కావల్సిన వ్యక్తితో చాట్ చేయాలంటే అంత పెద్ద లిస్ట్‌లో వెతుక్కోవాలి. లేదా సెర్చ్ బార్‌ను ఉపయోగించాలి. ఇకపై ఆ అవసరం లేకుండా వాట్సప్ తీసుకొచ్చిన కస్టమ్ లిస్ట్ ద్వారా వాటిని ఫిల్టర్ చేయొచ్చు. అంటే ఫ్యామిటీ, ఆఫీస్, ఫ్రెండ్స్ మీకు నట్చిన లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు వాట్సప్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.