వాట్సప్ లో కొత్త ఫీచర్… త్వరలో 32 మందితో

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఫ్లాట్‌ఫారమ్ వాట్సప్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంస్థ వర్గాల ప్రకారం కొత్త ఫీచర్ దాదాపు వీడియో కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఏకకాలంలో 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవడం, అలాగే ఆడియో సహా స్క్రీన్ షేరింగ్‌ను పంచుకునే సౌలభ్యం కొత్త ఫీచర్ ప్రత్యేకత. ముప్పై మందికిపైగా ఉండే పెద్దగ్రూప్ మధ్య వీడియో కాలింగ్‌ను సులభతరం చేయడం, ద్వారా సంభాషణల ప్రక్రియను మెరుగుపరచడాన్ని మెటా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే, వినియోగాదారులు తమ స్క్రీన్‌ని ఆడియోతో షేర్ చేసుకోవచ్చు. దీనితో కలిసి వీడియోలను వీక్షించొచ్చు. గరిష్ఠంగా 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.