వాట్సప్ సరికొత్త ఫీచర్

సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మరికొన్ని సదుపాయాలు జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా, అవతలి వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. లింక్డ్ డివైజెస్‌లోని కాంటాక్ట్‌ని సేవ్ చేసేలా తన ప్లాట్‌ఫామ్‌ను రూపుమార్చనుంది.
వాట్సప్‌లోని చాట్‌లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే సదుపాయం ఉండేది కాదు. చాలామంది యూజర్లు వాట్సప్‌ని ఒకటికంటే ఎక్కువ డివైజుల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి వాళ్లు పేరు యాడ్ చేయడానికి ప్రతిసారీ ప్రైమరీ డివైజ్‌కు వెళ్లాల్సివచ్చేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ లింక్ చేసిన పరికరాల్లోనూ కాంటాక్ట్‌ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సప్ సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తులు మొదలు పెట్టింది.