18 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
మార్చి నెలలో 18.05 భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. తన నెలవారీ నివేదిక ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిర్యాదుల విభాగం ద్వారా వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగానూ, నిబంధనల ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న యంత్రాంగం ఆధారంగానూ ఈ నిషేధం విధించినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నిబంధనల ప్రకారం భారీ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్ (50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నవి) తప్పనిసరిగా ప్రతినెలా నివేదికను వెల్లడిరచాలి. వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను తెలపాలి.






