భారతీయ విక్రేతలకు వాల్‌మార్ట్ ఆహ్వానం
వాల్‌మార్ట్ యూఎస్ మార్కెట్‌ప్లేస్‌లో చేరి విదేశీ విక్రయాలను మరింత పెంచుకోవాలని భారతీయ విక్రేతలకు వాల్ల్మార్ట్ ఆహ్వానం పలికింది. అమెరికాలో ప్రతి నెలా 12 కోట్ల కొనుగోలుదార్లుకు వాల్‌మార్ట్ సేవలందిస్తోంది. భారత్ నుంచి ఇప్పటికే అధికంగా సరుకును వాల్‌మార్ట్ తీసుకెళ్తోంది. 2027 నాటికి మన దేశం నుంచి ఏటా 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.75,000 కోట్ల) ఉత్పత్తులను తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని వాల్‌మార్ట్ నిర్దేశించింది. 20 ఏళ్లకు పైగా వాల్‌మార్ట్‌తో కలిసి పనిచేస్తున్న భారతీయ ఎగుమతిదార్ల విస్తరణకు ఈ చొరవ దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. భారతీయ ఇ`కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా వాల్‌మార్ట్ ఆధానంలోనే ఉంది. భారతీయ విక్రేతలు అంతర్జాతీయ వినియోగదారులు పొందేందుకు చక్కటి అవకాశం దక్కిందని ప్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేటు ఆఫైర్స్ ఆఫీసర్ రజ్నీష్ కుమార్ తెలిపారు.






